పొదుపు మహిళలు ఆర్థికంగా ఎదగాలి :- బ్యాంకు మేనేజర్ సురేష్.. పాములపాడు మండల కేంద్రంలో ఈరోజు జరిగిన స్థానిక మండల వెలుగు కార్యాలయం నందు వివోఏలకు మరియు పొదుపు మహిళలకు రుణ మరియు జీవనోపాదుల ప్రణాళిక కు సంబంధించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏపీఎం ఉమామహేశ్వరి మాట్లాడుతూమహిళలు ఆర్థికంగా ఎదిగి ప్రతి ఇంట్లో ఒక జీవనోపాధిని పెట్టుకునే విధంగా అవగాహన కల్పించడం జరిగినదన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా శ్రీనిధి ఉన్నతి ద్వారా రుణము తీసుకొని మహిళల ఆర్థికంగా డెవలప్ కావాలన్నారు సర్ఫ్. ఐబీ కి సంబంధించి అదనపు సహాయకులైనటువంటి శ్రీధర్ రావు మరియు బ్యాంకు లింకేజీ డిపిఎం ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ డిపిఎం నాయక ఈరోజు జరిగిన ట్రైనింగులో సలహాలు ఇవ్వడం జరిగినదన్నారు అదేవిధంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ బ్యాంకులో చేసుకోవాలని సూచించారు





