(నేటి సాక్షి ప్రతినిధి ): రైతుల ప్రయోజనాల కోసమే ఎప్పటికప్పుడు కొత్త రకం వంగడాలను తెస్తున్నట్లు గోల్డెన్ సీడ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎం డీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. హైద్రాబాద్ లో ఆదివారం డీలర్ల సమావేశం నిర్వహించారు. కొత్తగా ఈ ఏడు వచ్చే సర్పంచ్, ఆమనీ గోల్డ్, గోల్డెన్ 99 రకాల వరి, మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెగుళ్ల బారిన పడకుండా ఎక్కువగా దిగుబడి వచ్చేల ప్రతి ఏటా కొత్త విత్తనాలను తెస్తున్నట్లు తెలిపారు. గోల్డెన్ సీడ్ కేవలం ఆర్ధిక లాభాలు కాకుండా రైతులు, డీలర్ ల మేలుకోసం తపిస్తుందన్నారు. తాను ప్రొడక్షన్లో ఉన్న అనుభవం నుండి వచ్చి విత్తనాల కంపెనీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరిలో సర్పంచ్ దొడ్డు రకం విత్తనాలు సుమారు 35నుండి 40క్వింటల్ల దిగుబడి వస్తుందని తెలిపారు. , ఆమనీ గోల్డ్ సన్న రకం వరి 30నుండి 35క్వింటలు దిగుబడి వస్తాయని తెలిపారు. , మక్కజొన్న లో రాయల్99 నీటి వసతి తక్కువగా ఉన్న సుమారు 30క్వింటల్ల వరకు దిగుబడి వస్తాయని వివరించారు. ఈకార్యక్రమంలో పలు జిల్లాల డీలర్లు భాస్కర్ రెడ్డి, అంబారెడ్డి, బాలు,సంజీవ్ మహేందర్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.





