Thursday, April 23, 2026

బస్ డిపో వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్…..

నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 23,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),టీజీఎస్‌ఆర్టీసీ (టీజీస్ర్టీసీ ) జేఏసీ సమ్మె నేపథ్యంలో నారాయణపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ క్షేత్రస్థాయిలో సందర్శించి, భద్రతా ఏర్పాట్లను అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య గారితో మాట్లాడి బస్సుల రాకపోకలు మరియు డిపో వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో విధులకు హాజరయ్యే డ్రైవర్లు మరియు ఇతర సిబ్బంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి పోలీసు శాఖ తరపున పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేసినా, లేదా ప్రభుత్వ ఆస్తులైన బస్సులకు నష్టం కలిగించినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించి ఆందోళనలకు దిగేవారిపై, విధులను అడ్డుకొనే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను ఆదేశించారు. జిల్లా లోని రెండు డిపోలలో పరిస్థితి శాంతియుతంగా కొనసాగుతోంది, అర్టీసీ విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఎవరు భయపడకుండా తమ విధులకు హాజరు కావాలని అందుకు పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుంది అని తెలిపినారు. మరియి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యాలు కొనసాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ తో పాటు నరేష్, సై ఈ ఎస్ ఈ ఎస్ ఐ లు వెంకటేశ్వర్లు, రాజు పోలీసు సిబంది ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News