నేటి సాక్షి, పరిగి. (సురేష్ మోత్కూర్ ).పరిగి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత్ బంద్ లో భాగంగా, పరిగిలో బస్టాండ్ ఎదురుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ……. కేంద్ర ప్రభుత్వం జరపనున్న జనగణనలో ఓబీసీ కులాల వారి జనగణన చేపట్టాలని, ఓబీసీ పట్టికను పొందపార్చాలి,1931 లో బ్రిటిష్ ప్రభుత్వంలో మాత్రమే జరిగిన కులగణనలో ఓబీసీ లను లెక్కించారు అప్పటినుండి సుమారు తొంబై ( 90) సంవత్సరాలు అయింది ఓబీసీ కులగణనచెయ్యక, జంతువుల లెక్కలు నిర్వహిస్తున్నారుకానీ ఓబీసీ లను కులగణన చేస్తాము అని పార్లమెంట్ లో తీర్మానం చేసి కూడా లెక్కచేయ్యకపోవడం బీసీ లను మరో సారి మోసం చేస్తున్నది బీజేపీ నరేంద్రమోడీ ప్రభుత్వం అని, బీసీ పట్టికని పెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ బంధ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల రక్షణ కొరకకు తెచ్చిన యుజిసి ఈక్విటీ చట్టం- 2026ను కఠినముగా అమలు చేయాలని యూనివర్సిటీ లలో ఎస్సి, ఎస్టి,తో పాటు ఓబీసీ ల పై కూడా కులం పేరు తో ర్యాగింగ్, అన్యాయ అత్యాచారం జరుగుతున్నాయి. యూజీసీ చట్టాన్ని పక్కడబంది గా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈవిఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తూ ఈ దేశ మూలనివాసి బహుజనులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు ఇవ్వాలని,Rtc కార్మికుల న్యాయమైన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం rtc ని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని న్యాయమైన హక్కులను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, ఎండి హబీబ్, సత్తయ్య, పీర్ మమ్మద్, భారత్ ముఖి మోర్చా జిల్లా నాయకులు శంకర్, వీరేందర్ నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు కృష్ణ, ఆర్టీసీ (RTC )యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.





