నేటి సాక్షి 27 ఏప్రిల్ పాములపాడు :-పాములపాడు మండలంలోని, బానకచర్ల గ్రామంలో సుంకుల.రామలింగమ్మ, సుంకుల.రామారావు ల పేద కుటుంబానికి 3 లక్షల రూపాయల నిధులతో పి4 (పబ్లిక్-ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్) క్రింద బంగారు మార్గదర్శకులు అంతర్జాతీయ సమాజ సేవకుడు & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు నిర్మించిన నూతన గృహప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని, దాత కుటుంబ సభ్యులతో కలిసి నందికొట్కూరు నియోజవర్గం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య శిలాఫలకాన్ని ఆవిష్కరించి, గృహాన్ని రిబ్బన్ కటింగ్ చేసి, ఘనంగా ప్రారంభించడం జరిగింది.మొదట ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కు బంగారు మార్గదర్శి సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు, ఆమె తల్లి వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా చెప్పుకొనే పి4 ద్వారా నియోజకవర్గంలో బంగారు కుటుంబాలుగా గుర్తించబడిన వ్యక్తులు, వారి పరిసర ప్రాంతాలలో నిరుపేదలైన వ్యక్తులను గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలపడం జరిగింది.అలాగే కార్యక్రమంలో లబ్దిదారులైన సుంకుల.రామారావు మాట్లాడుతూ గ్రామంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న నా కుటుంబాన్ని గుర్తించి, మాకు నూతన గృహాన్ని నిర్మించి ఇచ్చిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు కి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.అనంతరం కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, అంతర్జాతీయ సమాజం & హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు లకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానించడం జరిగింది. ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ప్రారంభించడం.బానకచర్ల, వేంపెంట గ్రామాల కార్యక్రమాల అనంతరము నందికొట్కూరు నుండి వచ్చిన నాయకులకు, మండలంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులందరికీ, మండల నాయకులకు, గ్రామాల నాయకులను, వచ్చిన వారందరికీ సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు విందు భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, తహసిల్దార్- జి.సుభద్రమ్మ, ఎస్సై- పి.తిరుపాలు, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, పిహెచ్సి వైద్యాధికారిణి ఇ.వి.నాగలక్ష్మి దేవి, డిటి-పఠాన్ బాబు, ఉపాధి హామీ ఏపీఓ- జయంతి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ-ఎస్.సువచ్చల, పిఆర్ జెఈ- బి.వి.ఎన్.రాఘవేంద్రప్రసాద్, మండల కన్వీనర్- జీ.రవీంద్ర రెడ్డి, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, శేఖర్, హరీనాథ రెడ్డి, బండ్లమూరి.వెంకటేశ్వరరావు, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, వెంకటేష్ రెడ్డి, రాము, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్ కరీం బాషా, రుద్రవరం సురేష్, ఇస్కాల ఏర్వ.నాగలక్ష్మిరెడ్డి, జూటూరు నాయిని మధు, పూసల కృష్ణ, మల్లీశ్వరరెడ్డి, పీఏ-మద్దిలేటి, హెల్త్ సూపర్వైజర్ మల్లికార్జున, హెల్త్ సిబ్బంది హరికృష్ణ, పుల్లయ్య, వేంపెంట నాయకులు ఎంపీటీసీ బోనాల నాగ లక్ష్మమ్మ, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేశ్, వేమా రెడ్డి, రమేష్ రెడ్డి, రత్నాకర్, చిన్నస్వామి ఆచారి, బాలకృష్ణ, కిరణ్, యెర్రసాని రాము, కుటుంబరావు, బోనాల భాస్కర్, చిరంజీవి గౌడ్, మధుసూదన్ గౌడ్, సుంకన్న, నెంబర్ లక్ష్మన్న, గాండ్ల.సుబ్బారావు, ముద్దపాటి ప్రసాద్, రాముడు, నాగేశ్వర నాయక్, రామచంద్రుడు, నారాయణ, చిన్న హుస్సన్నయ్య, సిరిగిరి ప్రసాద్, మద్దూరు ప్రసాద్, నులక చంద్ర, జనసేన శేషు, శ్రీధర్, ఎల్లసుబ్బడు తదితరులు పాల్గొన్నారు.





