Tuesday, April 28, 2026

కానిస్టేబుల్ కుమార్తెను అభినందించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్…..

నేటి సాక్షి నారాయణపేట ఏప్రిల్ 28 (రిపోర్టర్ ఇమామ్ సాబ్)నారాయణపేట జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ వి.రాఘవేందర్ కుమార్తె వి నవ్య ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచిన సందర్భంగా, ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ని మర్యాదపూర్వకంగా కలుసుకుంది.ఈ సందర్భంగా ఎస్పీ గారు నవ్యను అభినందిస్తూ, ఆమె కృషి, పట్టుదల అభినందనీయమని పేర్కొన్నారు. విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులో ఇంకా మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.అలాగే, కానిస్టేబుల్ రాఘవేందర్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ, తన కుమార్తెకు ఉన్నత విద్య అందించేలా మరింత ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం పిల్లల విజయానికి ముఖ్యమని తెలిపారు.ఈ విజయం పోలీసు శాఖకు గర్వకారణమని ఎస్పీ పేర్కొన్నారు. నవ్య లాంటి విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు.ఈ కార్యక్రమంలో వనపర్తి రాజేష్ మీనా పోలీసు కానిస్టేబుల్ రాఘవేందర్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News