Friday, May 1, 2026

* పేదల దేవుడు సీ ఎం చంద్రబాబు నాయుడు.* నంద్యాలలో ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్.రాజకుమారి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

నేటి సాక్షి 01మే నంద్యాల:- ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ప్రతి నెల ఒకటవ తేదీననే అర్హులైన లబ్ధిదారులకు ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్ అందిస్తూ పేదల దేవుడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుచారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పట్టణం క్రాంతి నగర్ మోడల్ కాలనీ, రోజాకుంట అంజుమన్ వీధుల్లో శుక్రవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.నంద్యాల పట్టణం 39 వ వార్డు రోజాకుంట అంజుమన్ వీధిలో రాష్ట్ర న్యాయశాఖ, మైనారటి సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారిలతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా క్రాంతి నగర్ మోడల్ కాలనీలో పెన్షన్ లబ్ధిదారులతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ముందగానే, ఒకటవ తేదీ ఆదివారం అయితే ఒక రోజు ముందుగానే ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్ అందిస్తూ అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు తాము అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తున్నారన్నారు. నంద్యాల జిల్లాలో ప్రతి నెల 1 వ తేదీన 2,11,468 మంది ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు రూ. 92 కోట్లు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు.గత ఐదేళ్ళ వైసీపీ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ విస్మరించి ఏటా రూ. 250ల ప్రకారం రూ. 1000 లు పెంచితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలకు రెండు వేలు పెంచి రూ 4 వేలు, దివ్యాంగులకు నాలుగువేల రూపాయలు, పెంచి నెలకు రూ. 6 వేలు, ధీర్గకాలికి రోగులకు, 100 శాతం వికలాంగుల కు రూ. 10 వేలు, 15 వేలు పెంచి ప్రతి నెల ఒకటవ తేదీననే అర్హులైన లబ్ధిదారులు ఇళ్ల వద్దకే అధికారులు వచ్చి పంపిణీ చేయడం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిదని ఆ ఘనత సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వంకు దక్కుతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. క్రాంతి నగర్ మోడల్ కాలనీలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వెంట సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, వార్డు నాయకులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News