Saturday, May 2, 2026

సహాయ కార్మిక కమీషనర్, వికారాబాద్ జిల్లా వారి కార్యాలయం.అవగహన కార్యక్రమం

నేటి సాక్షి వికారాబాద్ :మే డే వేడుకలలో భాగంగా భవన నిర్మాణ కార్మికుల రిజిస్ట్రేషన్ పైన మదుల్ చిట్టంపల్లి, వికారాబాద్ నందు అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగహన కార్యక్రమం లో భాగంగా శ్రీ ఎం. యాదయ్య సహాయ కార్మిక అధికారి, వికారాబాద్, గారు మాట్లాడుతూ ప్రతి భవన నిర్మాణ కార్మికుడు 110/- రూపాయలు చెల్లించి భవన నిర్మాణ సంక్షేమ మండలి లో నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. చేసుకున్నా కార్మికులకు ఐదు సంవత్సరాల వరకు ఈ కార్డు కాల పరిమితి ఉంటుంది. కార్డు వున్నా ప్రతి కార్మికుడికి ప్రమాద బీమ్ క్రింద 10,00,000/- రూపాయలు సహజ మరణం క్రింద 2,00,000/-రూపాయలు, ప్రసూతి సహాయం వివాహ కానుక క్రింద 30,000/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. కార్డు వున్నా ప్రతి కార్మికుడు, ప్రతి ఐదు సంవసరాలకి ఒక సారి 60/- కట్టి మీసేవ ద్వారా రెన్యువల్ చూసుకోవాలని చెప్పడం జరిగింది. తదుపరి మాట్లాడుతూ లబ్ది దారులకు నేరుగా వారి బ్యాంకు అకౌంట్ లో కి డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి మధ్య వర్తులని ఆశ్రహించవద్దని కోరడం జరిగింది. ఈ కారిక్రమం లో సి.స్.స్. జిల్లా కోఆర్డినేటర్ ఎన్. జి.ఓ. వారు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News