నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ నియోజకవర్గ స్థాయి 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిథి గా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లొ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా SP స్నేహ మెహ్రా, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జడ్పీ సీఈఓ సుదీర్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, వికారాబాద్, మర్పల్లి AMC చైర్మన్లు చాపల శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, సర్పంచ్లు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందాలనే లక్ష్యంతో 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామని తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం.స్థానికంగా ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించడం.ఈ ప్రణాళిక ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పీకర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





