Monday, May 4, 2026

*సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బొగ్గు గాని కార్మికుల దినోత్సవ వేడుకలు కోల్ ఇండియా డే సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులకు సన్మానం*

నేటి సాక్షి మే 4 ( మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బొగ్గు గాని కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమానికి కన్న ముందు సింగరేణి తల్లి ఒడిలో 30 నుండి 35 సంవత్సరాలు వివిధ రంగాల్లో విధులు నిర్వహించి మృత్యోగృహ లాంటి బొగ్గు గనుల్లో తమ రక్తాన్ని చెమటకా మార్చి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పీకల లోతు నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణి కంపెనీని సిక్కు ఇండస్ట్రీగా పరిగణించి బిఐఎఫ్ ఆర్ చేతుల్లోకి పోయిన సింగరేణి సంస్థను కార్మికులు ఎంతో కష్టపడి శ్రమా పడి నష్టాల బారి నుండి సింగరేణి కంపెనీని లాభాల బాటలోకి తీసుకొచ్చి బాయిలో వివిధ రంగాలలో నైపుణ్యం ప్రదర్శించి సింగరేణి సంస్థ నుండి పదవి విరమణ పొందిన పలువురు సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కోల్ ఇండియా డే సందర్భంగా పూలబోకెలు అందజేసి శాలువాలతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేసినారు ఈ సందర్భంగా పలువురు సింగరేణి విశ్రాంత సంఘం నాయకులు మాట్లాడుతూ 1952 మే 4న భారత పార్లమెంటులో కోల్ మైన్స్ యాక్ట్ 1952ను ఆమోదించినారని బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం కోసం ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు అందుకే ప్రతి సంవత్సరం మే 4న దేశవ్యాప్తంగా బొగ్గు గాని కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారని అన్నారు అదేవిధంగా బొగ్గు గాని పుట్టినరోజె మే 4వ తేదీకి బొగ్గు గని చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని 1774లో జార్ఖండ్ లోని రాంచీ దేశంలోనే మొదటి బొగ్గు గాని ఏర్పాటు అయినదని ఆ రోజే బొగ్గు గాని కార్మికుడు పుట్టినట్టుగా భావిస్తారని దీంతో ఆ రోజుకు గుర్తుగా గని కార్మికులు స్మరించుకుంటారని పేర్కొన్నారు ఈ సందర్భంగా అందరికీ బొగ్గు గాని కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు అదేవిధంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థలో బొగ్గు కీలకపాత్ర పోషిస్తుందని విద్యుత్తు ఉత్పత్తిలో ఇప్పటికీ బొగ్గు ప్రధాన వనరుగా కొనసాగుతుందని ఈ నేపథ్యంలో బొగ్గుగని కార్మికుల శ్రమలేకుండా దేశ అభివృద్ధి అసంపూర్తిగా మిగులుతుందని అయితే ఈ వాస్తవాన్ని గుర్తించడంలో సమాజం మరియు పాలక వర్గాలు జాతీయ యూనియన్లు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు కోల్ మైండ్స్ డే సందర్భంగా కేవలం స్మరణలతో ఆగిపోకుండా కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి యూనియన్లు,ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కృషి చేయాలని పేర్కొన్నారు దేశ ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్న బొగ్గు గాని మరియు విశ్రాంత ఉద్యోగులకు ఆత్మగౌరవంతో బతికే విధంగా 50 శాతం కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంచాలని ఉచితంగానే కార్పొరేట్ వైద్య సౌకర్యాలు కల్పించాలని 2016 నుండి పెరిగిన గ్రాడ్యుటి సీలింగ్ 20 లక్షలు చెల్లించాలని తదితర సమస్యల పరిష్కారం కోసం కోల్ ఇండియా డే రోజున యావత్ కార్మికులందరూ పోరాడుదాం అని ప్రతిజ్ఞ చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గజేల్లి వెంకటయ్య అధ్యక్షుడు,గౌరవ అధ్యక్షులు రాళ్ల బండి రాజన్న,ప్రధాన కార్యదర్శి పూదారి నరసయ్య, ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని, రామ్ రెడ్డి, నారాయణ, కార్యదర్శి ఏ రాజేశం,నాయకులు సత్యనారాయణ, జె నారాయణ,సత్యనారాయణ రాజు, జి లక్ష్మణ్, పర్వతాలు యాదవ్,లక్ష్మీనారాయణ గౌడ్,రాజేందర్,రాజన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జై తెలంగాణ జై జై సింగరేణి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అని సింగరేణి అమరవీరులకు జోహార్లు అంటూ పెద్ద పెట్టినా నినాదాలు చేసినారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News