Friday, May 8, 2026

*జనాభా లెక్కలతో పాటు బీసీ కులగనగా చేపట్టాలి*

*నేటి సాక్షి, నల్లబెల్లి* జనాభా లెక్కలతో పాటు బీసీ కులజనగణన చేపట్టాలనీ బీసీ హక్కుల సాధన సమితి మండల కార్యదర్శి చీకటి ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్ పార్క్ వద్ద ఈ నెల 10న తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ కులాల జనాభా లెక్కలు తీస్తామనీ పార్లమెంటు సాక్షిగా రాజ్ నాథ్ సింగ్, మోడీ ప్రభుత్వం కూడా చెప్పిందని 2026లో చేపట్టబోయే జనాభా లెక్కలతో కలిపి కుల జనగణన చేపడతామనీ చెప్పి మళ్ళీ కేవలం జనాభా లెక్కలు మాత్రమే తీసే విధంగా సర్వే ఫార్మ్ తయారు చేశారన్నారు.బీసీ కులజనగణనకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద జరుగు అఖిలపక్ష బీసీ సంఘాల నిరసన ధర్నాను జయప్రదం చేయాలన్నారు. అగ్రవర్ణాలకు ఎటువంటి లెక్కలు తీయకుండానే 2019లో 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ కల్పించి బీసీలకు అన్యాయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కడియాల క్రాంతి కుమార్, కొనకటి రమేష్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News