నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )తీవ్రమైన కడుపు నొప్పిని భరించలేక మనస్తాపానికి గురై గడ్డి మందు తాగిన వ్యక్తి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గొల్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన ముస్కు రామకృష్ణ రెడ్డి (50) గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అనేకచోట్ల చికిత్స చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో,ఆ నొప్పిని భరించలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే జీవితం పై విరక్తి చెంది,ఇంట్లో ఉన్న గడ్డి మందు (పురుగుల మందు) తాగారు.విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో రామకృష్ణ రెడ్డి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





