Friday, April 24, 2026

కేటీఆర్ కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయండి

నేటి సాక్షి, బెజ్జంకి: భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు మార్చి 23, 2025, ఆదివారం రోజున కరీంనగర్ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా, బెజ్జంకి మండలంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, నాయకులు ఉదయం 10 గంటలకు రేణికుంట టోల్గేట్ వద్ద బైక్‌లు మరియు కార్లలో చేరి, అక్కడ నుండి ర్యాలీగా కరీంనగర్ బయలుదేరి, కేటీఆర్ కు ఘన స్వాగతం పలకాలని బెజ్జంకి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్, సొసైటీ, రైతు సమన్వయ సమితి సభ్యులు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News