Tuesday, April 21, 2026

జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలి…… మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందాలి…… మరికల్ గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్……విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం…… నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్…..

నేటి సాక్షి,నారాయణపేట, ఏప్రిల్ 21, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో సంక్షేమ వారోత్సవాలు విజయవంతంగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తేదీ 20 నుండి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మరికల్ పీఎంశ్రీ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు అలాగే జూనియర్ కళాశాలలో సంక్షేమ వారోత్సవాలు సమర్థవంతంగా నిర్వహించాలని , కిచెన్ తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వంటగది, స్టోర్ రూమ్, రైస్ రూమ్ లో బియ్యం చూసినారు, డైనింగ్ హాల్ తో పాటు పరిసరాలను పరిశీలించారు. ఫ్యాన్స్ లైట్స్ అన్ని ఉన్నాయ్ ప్రిన్సిపల్ నీ అడిగినరూ.బిల్డింగ్ మొత్తం తిరిగి చూసినారు. మెనూను తప్పక పాటించి పిల్లలకు సమయానికి ఆహార పదార్థాలను అందించాలని సూచించారు.ఈ సందర్భంగ విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించి విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, ప్రిన్సిపాల్ తాసిల్దార్ పి ఆర్ ఈ ఈ ఎంపీడీవో టీచర్లు, సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News