Monday, April 20, 2026

నీకో అర్బన్ పార్కును ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

నేటి సాక్షి వికారాబాద్ :రూ. 2.50 కోట్లతో నూతనంగా అభివృద్ధి చేసిన అనంతగిరి ఏకో అర్బన్ పార్కును సోమవారం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ .పాల్గొన్న వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య గారు, AMC చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, PCCF డాక్టర్ సువర్ణ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సునీత భగవత్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (చార్మినార్ సర్కిల్) ప్రియాంక వర్గీస్, టూరిజం వింగ్ డైరెక్టర్ రంజిత్ నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పర్యాటకులు.ఈసందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ….అనంతగిరి అటవీప్రాంతాన్ని అన్ని విధాలుగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం.తెలంగాణ కశ్మీర్ అనంతగిరి, అందమైన ప్రదేశం. పర్యావరణానికి హాని కలగకుండా అన్ని వసతులతో ఏకో టూరిజంగా అభివృద్ధి చేస్తున్నాంపర్యాటకులకు మంచి అనుభూతి కలిగే విదంగా వాచ్ టవర్లను, ఇతర వసతులను ఏర్పాటు చేయడం జరిగింది.అనంతగిరిలో పర్యాటక రంగం అభివృద్ధితో ఈ ప్రాంతంలోని వారికి ఉపాధి కలుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News