నేటి సాక్షి వికారాబాద్ వికారాబాద్ జిల్లా కేంద్రం లో నిన్న రాత్రి అనగా 29.4. 2026 రోజు రాత్రి అందాజ 12 గంటల సమయంలో ఒక ఇన్నోవా వెహికల్ నెంబర్ AP 28 R 1000 గల ఇన్నోవా కార్ హైదరాబాదు నుండి వికారాబాద్ కి వస్తుండగా వాళ్ల రిలేటివ్స్ కొత్తగడి లో కలిసి టీ తాగడం కోసం వికారాబాద్ కి వస్తుండగా కేడిఆర్ బార్ దగ్గరికి రాగానే రోడ్డు మధ్యలో ఉన్నటువంటి డివైడర్ను బలంగా గుద్దడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు వ్యక్తులలో కలిముద్దీన్, అక్బరుద్దీన్, నూరుద్దీన్, నాసిర్ హుస్సేన్ లలో కలిముద్దీన్ కి చెస్ట్ కి హెడ్కి బలమైన దెబ్బలు తగలడంతో హాస్పిటల్కి తీసుకుపోయే క్రమంలో కలిమోదిన్ చనిపోయినట్టు తెలిసింది మిగిలిన ఇద్దరు హాస్పిటల్ లో జాయిన్ అయి డిశ్చార్జ్ అయినట్టు తెలిసింది.నిర్లక్ష్యంగా నడిపి కలిముద్దీన్ మృతికి కారణమైన వ్యక్తి పైన కేసు నమోదు చేసినాము ఈ ప్రమాద స్థలాన్ని ఆర్ అండ్ బి ఈ ఈ గారు, మున్సిపల్ కమిషనర్ , మున్సిపల్ ఏఈ ,వికారాబాద్ టౌన్ సిఐ రఘుకుమార్ గారు విజిట్ చేసి ప్రమాదాన్ని గల కారణాలు అధ్యాయం చేసి అక్కడ మళ్లీ ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకున్నందుకు ప్రయత్నం చేస్తున్నారు.





