Thursday, April 30, 2026

ఉపాధి హామీ కూలీలకు మౌళిక సదుపాయాలు కల్పించాలి-ఎంపిడిఓ అలివేలు మంగమ్మ

నేటిసాక్షి, మిర్యాలగూడ : ఉపాధిహామీ కూలీలకు వేసవిని దృష్టిలో పెట్టుకొని, అన్ని గ్రామాలల్లో ఉపాధి హామీ పని జరిగే ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలనిదామరచర్ల ఎంపిడిఓ అలివేలు మంగమ్మ అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోనిదామరచర్ల మండలంలోని లావూరి భిక్యాతండ గ్రామ పంచాయతీలో స్థానిక ఎంపిడిఓ అలివేలు మంగమ్మ మరియు ఏపిఓ బి .నాగేశ్వరావు ఉపాధిహామీ కూలీలు పనులు చేసే ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం కూలీల రిపోర్ట్ పెరుగుటకు గ్రామాలలో ఉన్న కూలీల ను పెంచాలని సూచించారు. అనంతరం టెంట్ మరియు మంచి నీటి క్యాన్లు ను లావూరి భిక్యా తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గూగులోతు మంగ్తి రామారావు మరియు పంచాయతీ కార్యదర్శి మహేష్ సహకారంతో ఏర్పాటు చేశారు. అనంతరం కూలీలకు ఓఅర్ఎస్ ప్యాకెట్లను ఆమె పంపిణీ చేశారు. ఉపాధి హామీ కూలీలకు ఇబ్బంది కలగకుండా, పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాలు ప్రకారం దామరచర్ల మండలంలోని అన్నీ గ్రామ పంచాయతీలల్లో సర్పంచ్ లు మరియు అన్నీ గ్రామ పంచాయతీల కార్యదర్శి లు, ఉపాధి హామీ కూలీలకు టెంట్ మరియు మంచినీటి సౌకర్యం లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను మండలంలోని ఆశా వర్కర్లు అందరు, మీ గ్రామ పంచాయతీలాల్లో జరిగే పని ప్రదేశాలు వద్ద కూలీలకు పంపిణీ చేయాలని, మన మండలం వైద్య శాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఈసీ శంకర్, టీఏ శంకర్, వెంకన్నలు, పీఎస్ మహేష్ మరియు రామ ఎఫ్ఏ, మెట్ శ్రీను, ఆశా వర్కర్లు సైదమ్మ, కూలీలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News