Thursday, April 30, 2026

చిన్నారులకు ఆర్థికసాయం

నేటి సాక్షి, తిమ్మాపూర్:కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీకి చెందిన చిన్న పిల్లలకు ఆర్థిక సహాయం అందించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ టీమ్ సభ్యులు. చిన్నారుల తల్లిదండ్రులు రవికుమార్ లలిత దంపతులు తమ కుటుంబ గొడవల కారణంగా చిన్నారులను ఎల్ఎండీ ఠాణా లో వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా మీడియాలో వచ్చిన కథనాలను చూసిన ఎమ్మెల్యే దానం చిన్నారులకు అండగా నిలిచారు. గురువారం కరీంనగర్ వచ్చిన ఆయన టీం సభ్యులు పిల్లలకు లక్ష రూపాయల ఎఫ్ డీ తో పాటు నిత్యవసర సరుకులు వస్తువులు అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో చిన్న పిల్లలను వదిలి వెళ్లిన ఘటన ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాలో చూసి చలించిపోయాడని తెలిపారు. పిల్లల కుటుంబ పోషణ వారి జీవన విధానం గురించి తెలుసుకొని సహాయం అందించినట్లు చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News