Thursday, April 30, 2026

*10వ తరగతి ఫలితాలలో పాములపాడు శ్రీవివేకానంద విద్యా విహార్‌ హైస్కూల్ కు అఖండ విజయం* . 100% ఉత్తీర్ణతతో11మంది విద్యార్తులకు 510 నుండి 582 మార్కులు:-ఆర్.ఎస్.ఆర్.గోపాల్ (కరస్పాండెంట్) డిస్టింక్షన్ సాధించి అద్భుత ప్రతిభను కనబరిచిన పాములపాడు ఎస్.అయాజ్ అలీ కి 582 మార్కులు

నేటి సాక్షి 30 ఏప్రిల్ పాములపాడు:-నంద్యాల జిల్లా, మండల కేంద్రమైన పాములపాడులో ఉన్న శ్రీ వివేకానంద విద్యావిహార్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 2025-26 విద్యా సంవత్సరం ఎస్.ఎస్.సి ఫలితాల్లో ఈ పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించి ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగింది.ఈ ఫలితాల్లో మొత్తం-11 మంది విద్యార్థులు 510 నుంచి 582 మార్కులు సాధించి డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. వారిలోసయ్యద్.మహమ్మద్ అయాజ్ అలీ కు–(582/600) మార్కులు సాధించగా,షేక్.అనీషా –(570)మార్కులు,ఎం.ఉమాశ్రీ(563)మార్కులు,బి.రంగనాయకులు(556) మార్కులు,టి.భరత్(555)మార్కులు,జేఎల్ఎస్.చరిత(536)మార్కులు,బి.శృతి(522)మార్కులు,ఎస్.సుహాన(521)మార్కులు,పి.విష్ణువర్ధన్(521) మార్కులు,పి.సంత్ కుమార్(520)మార్కులు,ఈ.గీతిక(510) మార్కులు వచ్చాయనీ, ఇతర విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారన్నారు. ముఖ్యంగా ఎం.కార్తీక్ (466)మార్కులు, ఏ.సౌమ్య(424)మార్కులు కూడా మంచి ప్రదర్శన కనబరిచారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్. గోపాల్ విద్యార్థులను అభినందిస్తూ “ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల క్రమశిక్షణ మరియు తల్లిదండ్రుల సహకారంతో ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు.గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాల సాధించిన ఈ విజయంతో, అక్కడి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చిందని, సరైన మార్గదర్శకత్వం ఉంటే గ్రామీణ విద్యార్థులు కూడా అగ్రస్థానాలు సాధించగలరని ఈ ఫలితాలు నిరూపించాయన్నారు. ఈ సందర్బంగా శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరెస్పాండంట్ ఆర్ ఎస్ ఆర్. గోపాల్, అకాడమిక్ డైరెక్టర్ రాయపాటి.దేవిక ఉపాధ్యాయులు సురేంద్ర, హాబివుల్లా, నారాయణ ఆచారి, రామస్వామి, విజయ్ కుమార్, బాలకృష్ణమ్మ, షాజహాన్, జయలక్ష్మి, చంద్రకళ, నసీమ, రాణి, మైటీ ప్రియా, పుష్ప, శ్రీలక్ష్మి, గాయత్రి, స్కూల్ సిబ్బంది అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News