Thursday, April 30, 2026

*140 వ మేడేను వాడవాడలా జయప్రదం చేయండి…ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు పిలుపు*

నేటి సాక్షి 30 ఏప్రిల్ జూపాడుబంగ్లా:- ఎనిమిది గంటల పని విధానం కావాలని 1886వ సంవత్సరంలో అమెరికాలో చికాగో నగరంలో వేలాదిమంది పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల రక్త తర్పణంతో ఏర్పడిన జెండా ఎర్రజెండాఅని కార్మిక పోరాట స్ఫూర్తితో మేడే జరుగుతుందని ఈ మేడేలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పండగ వాతావరణం లో నిర్వహించే మేడేకు అనేక ఘన చరిత్ర ఉందని పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులు అంతం చూసేందుకు ఆనాడు లక్షలాదిమంది కార్మిక వర్గం చికాగోలో కదం తొక్కుతూ 8 గంటల పని 8గంటల విశ్రాంతి 8గంటల వినోదం కావాలని డిమాండ్ చేస్తూ పోరాట స్ఫూర్తిని కొనసాగించిన రోజు మేడే అని వారన్నారు. స్ఫూర్తితో భారత దేశంలో 1920 అక్టోబర్ 31 వ తారీఖున ఏఐటియుసి ఆవిర్భావం జరిగిందని సోషలిజమే అంతిమ లక్ష్యంగా కార్మిక వర్గ శ్రేయస్సు కోసం ఆవిర్భవించిన ఏఐటీయూసీ 106 సంవత్సరాలుగా అనేక పోరాటాలు కొనసాగిస్తుందని వారన్నారు. ఉద్యోగ కార్మిక వర్గానికి అనేక చట్టాలకు రూపకల్పన చేసి కార్మికుల హక్కులకు భంగం కలగకుండా పోరాటాలు నిర్వహించిందన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిగంటల విధానాన్ని పెంచుతూ 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా విభజించి కార్మికుల శ్రమను కార్మికుల సంపాదించిన సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ అరాచక పాలన చేస్తున్నారని ఈ మేడేస్ఫూర్తితో లేబర్ కోడ్స్ రద్దుకు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల నాయకులు సలీం బాషా,దస్తగిరి సిపిఐ నాయకులు మక్బుల్ భాషా వెంకటరమణ పుల్లయ్య రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి గిరిజన సమైక్య నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News