నేటి సాక్షి, ఎండపల్లి:* గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన ఎరవెల్లి పర్శరాం (43) బుధవారం రాత్రి చర్లపల్లి ప్రధాన కూడలి వద్ద తన కారు (టీఎస్ 02 యూఏ 1568) ను రోడ్డు పక్కన నిలిపి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర రక్తగాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడు గత నాలుగు నెలలుగా కరీంనగర్‌లో నివసిస్తూ సోడా బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య నాలుగేళ్ల క్రితమే మృతి చెందగా, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తల్లి ఎరవెల్లి లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్గటూర్ ఎస్సై పి.ఉదయ్‌కుమార్ తెలిపారు.





