*నేటి సాక్షి, ఎండపల్లి:* మండలంలోని చర్లపల్లి గ్రామంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు, ప్రయాణికుల దాహార్తి తీర్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ పడిదం లావణ్య-మొగిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో గ్రామస్తులకు, రహదారిపై ప్రయాణించే వారికి చల్లని తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, శరీరానికి తగినంత నీరు అందేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ప్రజాసేవలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా గ్రామ ప్రజలతో పాటు మార్గమధ్యంలో వెళ్లే ప్రయాణికులకు కూడా ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల పరిషత్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్, వార్డు సభ్యులు జెల్ల శ్రీనివాస్, నాయకులు కాటు రవి, మెరుగు రాజేశం, జంజుపెల్లి నరేష్, కరోబర్ ఉరగొండ శోభన్, శ్రీను, నారాయణ, రాజేశం తదితరులు పాల్గొన్నారు.





