నేటి సాక్షి తొగుట .. వడ్డే నరసింహులు*ప్రజా పాలనలో – ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి( అమర్), అధ్యక్షతన అధ్వర్యంలో రైతు వారోత్సవాలు* జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పంట రుణాలు పైన రైతులకు అవగాహన కల్పించారు. రైతు శ్రేయస్సుకోసం రైతు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మార్కెట్ సెక్రటరీ స్వామి ,గౌరవ సర్పంచ్ పాగాల శోభా కొండల్ రెడ్డి,అగ్రికల్చర్ ఏఓ మోహన్ ,PACS సెక్రటరీ గంగారెడ్డి SBI,TGVB బ్యాంక్ మేనేజర్లు,మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, వైస్ చైర్మన్ కొంగరీ నర్సింలు, డైరెక్టర్లు నరసింహారెడ్డి,స్వామి,బిక్షపతి,బిచ్చగౌడ్,సత్తయ్య,ఆన్సర్, శ్రీనివాస్,శ్రీకాంత్,సునీల్ నారాయణ రెడ్డి,నాయకులు భారత్,మల్లారెడ్డి,తదితరులు పాల్గొన్నారు





