Tuesday, April 28, 2026

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఓరెంటేషన్ కార్యక్రమం.జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్.

నేటి సాక్షి వికారాబాద్ :జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ కార్యాలయంలో “సెన్సస్ 2027 – సెల్ఫ్ ఎన్యూమరేషన్” (స్వయం గణన) ప్రక్రియపై పోలీసు సిబ్బందికి ఒక ప్రత్యేక ఓరియంటేషన్ సెషన్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ గ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ గణన ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ద్వారా పౌరులు తమ వివరాలను తామే సులభంగా, ఖచ్చితత్వంతో నమోదు చేసుకునే అవకాశం ఉందని, దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా తప్పులు దొర్లే అవకాశం ఉండదని వివరించారు. దేశాభివృద్ధికి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు జనగణన అత్యంత కీలకమని, పోలీసు సిబ్బంది అధికారులు ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి‌సి‌ఆర్‌బి డి‌ఎస్‌పి జానయ్య , డి‌టి‌సి డి‌ఎస్‌పి శ్రీనివాస్ పాల్గొని సిబ్బందికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్‌ను ఎలా ఉపయోగించాలనే అంశంపై సాంకేతిక అవగాహన కల్పించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో పాటు, ప్రజలకు కూడా ఈ డిజిటల్ గణనపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. https://se.census.gov.in ఈ లింక్ ను ఓపెన్ చేసి స్వీయ గణన చేసుకోవాలని,ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ 1855 నెంబర్ ను సంప్రదించాలని అధికారులు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఏ‌ఓ ఖాజా మోహినోద్దీన్, ఉమెన్ పి‌ఎస్ ఇన్స్పెక్టర్ వెంకటరాం ఆర్‌ఐ నాగరాజు,ఎస్‌ఐ లు,ఆర్‌ఎస్‌ఐలు, సెన్సస్ జిల్లా ఇంచార్జ్ జంగయ్య జిల్లా పోలీస్ కార్యలయం లోని వివిధ విభాగాలకు చెందిన పోలీసు అధికారులు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News