Friday, May 1, 2026

పథకం ప్రకారం హత్య, నిందితుడు అరెస్ట్….డీఎస్పీ నల్లపు లింగయ్య.

నేటి సాక్షి నారాయణపేట, మే 1, (రిపోర్టర్ ఇమామ్) నారాయణపేట జిల్లాలోని మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఖాజీపూర్ గ్రామంలో సంచలనంగా మారిన హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.ఘటన వివరాలు:తేది 27.04.2026 నాడు రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఖాజీపూర్ గ్రామ శివారులోని తన పొలం వద్ద కొత్తగా నిర్మిస్తున్న కోళ్ళ షెడ్డు దగ్గర మృతుడు హైమద్ @ అహ్మద్ (వయస్సు: 42 సంవత్సరాలు) ఉన్న సమయంలో, అతని సడ్డకుడు అయిన నిందితుడు మహమ్మద్ ఖాజా చేట్టుకింది ఖాజా (వయస్సు: 33 సంవత్సరాలు) పథకం ప్రకారం దాడి చేసి హత్య చేశాడు.హత్యకు కారణాలు:నిందితుడు మృతుడి భార్యపై అనుచిత కోరికలు పెట్టడం, ఆమె నిరాకరించడం, అలాగే మృతుడిని రూ.5 లక్షలు అప్పుగా ఇవ్వమని అడగగా అతను తిరస్కరించడం వల్ల ఇరువురి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ కక్షతో నిందితుడు మృతుడిని హత్య చేసి, అతని భార్యను మరియు ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చని భావించి ముందుగా పథకం రచించాడు.నేర విధానం:మృతుడు కోళ్ల షెడ్డు వద్ద ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించిన నిందితుడు ముందుగా అతనితో మాట్లాడి, అనంతరం చేతులతో దాడి చేసి కింద పడగొట్టాడు. తరువాత సిమెంట్ పెళ్లా, రాళ్లతో ముఖం మరియు తలపై తీవ్రంగా గాయపరచడంతో మృతుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు సంఘటన స్థలం నుండి బైక్ పై పారిపోయాడు.పోలీసుల చర్యలు:ఈ ఘటనపై క్రైమ్ నెం.110/2026, 103(1) బన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని ఈ రోజు అరెస్ట్ చేసి విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు.స్వాధీనం చేసుకున్న వస్తువులు:పోలీసులు నిందితుని నుండినేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ఒక సెల్ ఫోన్రక్తపు మరకలు గల బట్టలుస్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించడం జరిగింది అని డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు.కేసును జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ I ఆదేశాల మేరకు డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో కోస్గి సీఐ సైదులు, మద్దూర్ ఇంచార్జి ఎస్సై విజయ్ భాస్కర్, కోస్గి ఎస్ఐ బాలరాజు, రేవతీ, బాలయ్య, హెడ్ కానిస్టేబుల్ లు పెంటయ్యా, గోపాల్, పిసి లు పుల్చా నాయక్, నాగ మల్లయ్య, రవీందర్, పిసి లు రాఘవేందర్ రెడ్డి, శశి గౌడ్, ఆశ్రప్ అలీ, నరసింహులు, గణేష్ లను డిఎస్పీ నల్లపు లింగయ్య అభినందించి త్వరలో ఎస్పీ గారి చేత రివార్డు అందించడం జరుగుతుందని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News