నేటి సాక్షి, ఎండపల్లి:* కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు–మంజుల దంపతుల 33వ వివాహ వార్షికోత్సవం గురువారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, సర్పంచులు, అభిమానులు వారి నివాసానికి చేరుకుని దంపతులకు ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, వారి దాంపత్య జీవితం మరింత ఆనందంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సేవలో పొనుగోటి శ్రీనివాసరావు అందిస్తున్న సేవలను నాయకులు ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో సేవలందించాలని ఆకాంక్షించారు. ఆత్మీయత నిండిన వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొని దంపతులతో సంతోషాన్ని పంచుకున్నారు. కాగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పొనుగోటి దంపతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, సర్పంచులు గొల్లపల్లి మల్లేశం గౌడ్, బెడ్డల ప్రవీణ్, నాయకులు అవుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.





