నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )………………………………….పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీ నుండి బహిష్కృతులైన కొంత మంది నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం మరియు దారితప్పించే విధంగా ఉన్నాయి. రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే పార్టీ ఆదేశాల మేరకు మధుసూదన్ రెడ్డి జగిత్యాలలో కూడా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పార్టీలో లేని, బహిష్కరణకు గురైన కొంతమంది వ్యక్తులు బీజేపీ రాష్ట్ర నాయకురాలు డా.బోగ శ్రావణి గారిపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్థరహితమైనవి . ఇవి కేవలం వ్యక్తిగత అసంతృప్తి, స్వప్రయోజనాల కోసం చేస్తున్న నిరాధార ఆరోపణలు.ఇటీవల జరిగిన ఎన్నికలన్నీ పార్టీ ఆధ్వర్యంలో, ఎంపీ అర్వింద్ నాయకత్వంలో పారదర్శకంగా నిర్వహించబడ్డాయి. ప్రక్రియ అంతా పార్టీ మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగాపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేయడాన్ని తక్షణమే ఆపివేయాలి. క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుంది.





