*నేటిసాక్షి, నల్లబెల్లి* మండలంలోని కన్నారావుపేట గ్రామంలో మహిళా సంఘం నూతన భవన నిర్మాణానికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చరణ్ సింగ్ జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మూర్తి, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు జిల్లా మునీందర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఏడాకుల సంపత్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల సంపత్ రెడ్డి, బత్తిని మహేష్, అలాగే కాంగ్రెస్ నాయకులు మనోహర్, పోగుల కుమారస్వామి, అఖిల్, సురేష్, సహదేవ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.





