Wednesday, April 29, 2026

వి.కోటలో రిపోర్టర్ దారుణ హత్యఘటనను ఖండించిన చౌడేపల్లి మండల పాత్రికేయులు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి 28చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం రేపింది. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుడిని పట్టపగలు అమానుషంగా హత్య చేయడం సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ ఘటనను ఖండిస్తూ చౌడేపల్లి మండల పాత్రికేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దురాగతాలు పునరావృతం కాకుండా పాత్రికేయుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం, పోలీసు శాఖను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ పార్వతి, ఎస్సై చిన్నరెడ్డప్పలకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తున్న పాత్రికేయుడిని దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండలానికి విశాలాంధ్ర శ్రీనివాసులు, మణి సింగ్, నాగరాజు, ఉత్తరది హరి ప్రసాద్, దేవేంద్ర,అశోక, మురళి, మహేష్, జయ కుమార్, గోవిందు, వెంకటేష్, చౌడేపల్లి కి చెందిన పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News