Friday, May 1, 2026

స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తి దుర్మరణం

  • స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

నేటి సాక్షి, సైదాపూర్ :
చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సైదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బొత్తలపల్లి గ్రామ మూల మలుపు వద్ద హుజురాబాద్ కేరళ ఇంగ్లీష్ మోడల్ స్కూల్ కు చెందిన స్కూల్ వ్యాన్ ద్విచక్ర వాహనంపై వస్తున్నపెర్కపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మర్రి సదానందం (44) అనే వ్యక్తిని బస్సు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేరళ స్కూల్ వ్యానును, డ్రైవర్ స్వామిని సైదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News