అధికార పార్టీ నాయకుల హావ
*అధికారులు కళ్లు మూసుకోవాల్సిందే
*సాండు మాఫియా దెబ్బకు మూత పడ్డ ఇసుక రిచ్
*గ్రామ శివారు గుట్టల మధ్య ఇసుక నిల్వలు
నేటి సాక్షి, మెట్ పల్లి
(గోరుమంతుల నరేందర్)
మండలంలో ఉన్న వాగు శివారు గ్రామాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక దందా మూడు ట్రాక్టర్లు ఆరు ట్రాలీలుగా దర్జాగా సరఫరా సాగుతోంది.అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చి పోయిన ఇసుక మాఫియా రెవిన్యూ, పోలీస్ అధికారులను తమ కనుసన్నల్లో నడుచుకునేలా ఒత్తిళ్ళు తెచ్చి లక్షల్లో సంపాదన తమ జేబుల్లో వేసుకుంటున్నారానే వాదనలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియాలో అధికార, ప్రతి పక్ష పార్టీల నాయకులు ఒక్కటయ్యారు.దింతో వాగుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్న అడిగేనాధుడు కరువాయ్యారు.
మెట్ పల్లి మండలంలోని వాగు శివారు గ్రామలైన ఆత్మకూరు, ఆత్మ నగర్, జెగ్గాసాగర్, రామలచ్చక్కపేట గ్రామాలలో ఇసుక మాఫియా రాత్రి, పగలు తేడా లేకుండా యాదేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా సాగుతున్న ఇసుక సరఫరాతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని గ్రామస్తులు పిర్యాదులు చేస్తే ఇసుక మాఫియా వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి గ్రామాలలో వాగులు, ఒర్రెల నుండి ట్రాక్టర్ల ద్వారా యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుపు తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అధికారులు అడ్డుకున్న గంటల్లో తమ ట్రాక్టర్ లను అధికార పార్టీ నాయకులు దర్జాగా విడిపిస్తున్నారు.అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని ప్రజలు కోరుతున్న అధికారులను అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారానే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
ఇసుక మాఫియాకు అడ్డెది
వాగు శివారులోని గ్రామాల్లో ఇసుకను పగలు గ్రామ శివారులోని గుట్టల్లో నిలువ చేసి రాత్రిళ్లు యాదేచ్చగా తరలిస్తున్నారు. ఇసుక తరలింపు వాహనాలతో గ్రామాల్లో ప్రజలు రాత్రిళ్లు బయటకు రావడానికి జంకుతున్నారు.వాగులు అధిక సంఖ్యలో ఉండటంతో ఇసుక మాఫియా రెచ్చిపోయి రాత్రివేళ ఇసుక ట్రాక్టర్లు,టిప్పర్లలో నింపి, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
అధికార పార్టీ నాయకుల కంట్రోల్ లో అధికారులు
రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక రవాణా యథేచ్చగా జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా అధికారులను అధికార పార్టీ నాయకులు కంట్రోల్ చేస్తున్నారానే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. మెట్ పల్లి మండలంలోని ఆత్మకూరులో గతంలో ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఇసుక రిచ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కాని ఇసుక మాఫియా అధికార పార్టీ నాయకులతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇసుక రిచ్ ను క్లోజ్ చేశారనే వాదనలు ఉన్నాయి. ప్రజల అవసరాన్ని అవకాశంగా మార్చుకుని అక్రమార్కులు ఒక ట్రాక్టర్ కు మూడు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.రోజుకు వందల కొద్ది ట్రాక్టర్లు ఇసుక రవాణా అవుతుంటే అధికారులు అడపా దడపా తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి ఒకటి రెండు ట్రాక్టర్లు పట్టుకుని చేతులు దులుపు కుంటున్నారు. అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ అడుగంటిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాడు బిఆరెస్.. నేడు కాంగ్రెస్
గత బిఆర్ఎస్ హయాంలో యాదేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరిగిన అధికారులు మామూళ్ల మత్తులో కళ్లు మూసుకున్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇసుక సరఫరాపై ఉక్కు పాదం మోపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే గతంలో ఇక్కడ పని చేసిన సీఐ ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపడంతో ఇసుక మాఫియా ఉక్కిరి బిక్కిరి అయింది. ఆయన బదిలీపై వెళ్లడంతో మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల ఇసుక మాఫియా సంబరాలు చేసుకున్నారనే పుకార్లు షికారు చేశాయానడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.నేడు ఇసుక మాఫియా కాంగ్రెస్ నాయకుల కను సన్నల్లో నడుస్తోంది.
కలిసిన అధికార-ప్రతిపక్ష ఇసుక మాఫియా
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ కార్యకర్తలు కొందరు ఇసుక మాఫియాగా మరి ఇసుకను అమ్మి సొమ్ము చేసున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మారడంతో అధికార పార్టీ నాయకులు, ప్రతి పక్ష పార్టీకి చెందిన ఇసుక మాఫియా టీం ఆయా గ్రామాల్లో ఇసుకను అనాదికార టెండర్లలో తమ స్వంతం చేసుకున్నారు. కాని కొందరు అధికార పార్టీ వారు గత ప్రభుత్వ హయాంలో తమను బిఆర్ఎస్ నాయకులు దగ్గరికి కూడా రానివ్వలేదని ఇప్పుడు వారిని ఇసుక మాఫియా టీం లోకి రానిచ్చేది లేదని గొడవకు దిగారు. దింతో ఇసుక మాఫియా టీం పంచాయతీ అధికార పార్టీ ముఖ్యనాయకుల వద్దకు చేరింది. దింతో ఈ పంచాయతీలో గత ఇసుక మాఫియా టీంకు గుడ్ విల్ కింద సుమారు పది లక్షల వరకు చెల్లించి వారిని పక్కకు తప్పించి ప్రస్తుతం అధికార పార్టీ కి చెందిన ఇసుక మాఫియా నాయకులు రంగంలో కి దిగినట్టు తెలిసింది.ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు కలుగజేసుకుని ఇసుక మాఫియ ఆగడాలను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.





