Thursday, March 12, 2026

తూర్పు సత్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)

బాపట్ల పట్టణంలోని ఉన్న తూర్పు సత్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు.బాపట్ల పట్టణంలో పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం చైర్మెన్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులతో బాపట్ల బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం తూర్పు సత్రం తరుపున విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు సంబంధిత కలిగే విధంగా ప్రజలకు అభివృద్ధి దిశంగా అడుగులు వేస్తూ వెళ్తుందని అన్నారు ఇందులో భాగంగా బాపట్లలో పార్టీలు అతీతంగా అన్ని పార్టీలకు సమానత్వం చేయడం కొరకే జనసేన పార్టీ కు చెందిన మహిళకు చైర్మన్ పదవి కేటాయించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న మీరు పార్టీలకు న్యాయం చేసే విధంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.తూర్పు సత్రం కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల వివరాలు చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి,డి.శిరీష, ఆవుల వెంకటసుబ్బమ్మ, ఎన్ రమాదేవి, పులివర్తి కిరణ్, పంచాజ్ఞుల రుక్మిణి, దేవరకొండ చెన్నకేశవులు, శిఖరం శ్రీను, కే కిరణ్ ను నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు,ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేనా పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు, బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామలసాంబశివరావు,జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్, కర్లపాలెం జనసేన పార్టీ అధ్యక్షుడు,గొట్టిపాటి శ్రీకృష్ణ, జనసైనికులు అంజనేష్‌ మరియు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News