Thursday, March 12, 2026

తాళం వేసిన ఇంట్లో దొంగతనం

నేటి సాక్షి, నల్లబెల్లి ప్రతినిధి సెప్టెంబర్ 14 : తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం గ్రామానికి చెందిన నందికొండ మైపాల్ రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారు అని పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై గోవర్ధన్ ఇంటి యజమానిని విచారించగా ఇటీవల కాలంలో రెండు నెలల క్రితం మైపాల్ రెడ్డి,తండ్రి రాజిరెడ్డి మరణించడంతో ఇల్లు వదిలి పెట్టాలని ఆచారంతో రెండు నెలల క్రిందటే ఇల్లు వదిలి ముగ్గురు అన్నదమ్ములు వేరే అద్దె ఇంట్లో ఉంటున్నామంటూ. ఎవరూలేని సమయం చూసిన దొంగలు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో చొరబడి బీరువా పగలగొట్టి ఇంట్లో విలువైన వస్తువులను దొంగలించారని బాధితుడు పోలీసులకు సమాచారం అందించడు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించి దొంగలను పట్టుకుంటామని బాధితులకు ఎస్సై గోవర్ధన్ తెలపడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News