Thursday, March 12, 2026

వైష్ణవి దేవి ఆలయంలో నేటి నుంచి దసరా మహోత్సవాలు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి
మండలంలోని పంచాయతీ కేంద్రం పుధిపట్లలో గల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకురాలు శ్రావణి వినోద్ తెలిపారు విశ్వావసు నామ సంవత్సర అశ్వయుజ శుద్ధ పాడ్యమి 22 నుంచి అక్టోబర్ రెండు వరకు ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అభిషేకములు అలంకరణలతో అత్యంత వైభవంగా అమ్మవారికి దసరా మహోత్సవాలు నిర్వహించబడునున్నారు 22న బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము 23న గాయత్రీ దేవి 24న అన్నపూర్ణాదేవి 25న కాత్యాయనీ దేవి 26న మహాలక్ష్మి దేవి 27న లలిత త్రిపుర సుందరి దేవి 28న మహా చండీ దేవి 29న సరస్వతీదేవి ముప్పై నా దుర్గాదేవి అక్టోబర్ 1న మహిషాసుర మర్దినీదేవి రెండున శాకంబరీ దేవి అలంకారాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు అదేవిధంగా ప్రతిరోజు తీర్థ ప్రసాద వినియోగము జరుగును అన్నారు ఒకరోజు అలంకరణకు అభిషేకమునకు భక్తులు రూ 1116lu చెల్లించి దసరా మహోత్సవాలలో భాగస్వాములు కావాలని కోరారు మరిన్ని వివరాలకు 6303834722 నెంబర్ను సంప్రదించాలన్నారు భక్తతులందరూ సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు ఈ సమావేశంలో ఆలయ నిర్మాణ దాత వినోద్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News