Tuesday, March 17, 2026

స్లెట్ హై స్కూల్ లో ఘనంగా మ్యాథమెటిక్స్ డే వేడుకలు*—————————————–

* నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్లేట్ హైస్కూల్లో మ్యాథమెటిక్స్ డే వేడుకలు సోమవారం నాడు ఘనంగా జరిపారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులందరూ రకరకాల గణిత శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఎక్స్పరిమెంట్లు తయారుచేసి ప్రదర్శించారు. తదనంతరం పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిజజీవితంలో ఎన్నో సందర్భాలలో గణిత విలువలను ఉపయోగిస్తామని, ఉదయం లేవగానే గడియారంలో సమయం చూసుకోవడం,షాప్ కి వెళ్తే నోట్ల రూపాయలతో లెక్కించడం ఇలా రకరకాల ఉదాహరణలతో గణిత శాస్త్రం ప్రాముఖ్యతను తెలిపారు. అనంతరం గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను గణిత శాస్త్రంలో ఆయన కనిపెట్టిన విలువలను సిద్ధాంతాలను విద్యార్థులకు క్షుణ్ణంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తిరుపతిరెడ్డి,రాజ్యలక్ష్మి,పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న,ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News