Saturday, May 16, 2026

*పశువుల అక్రమ తరలింపు*

*నేటిసాక్షి* మే 15 తిరుమలాయపాలెం (రుద్రరాజు).ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ క్రాస్ రోడ్డు వద్ద తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా ఉన్న లారీని ఆపి తనిఖీ చేయగా ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్తున్న TS07UG2559 లారీలో అక్రమంగా పశువులను బంధించి రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ షేక్ జమీల్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది, అలాగే తూనీ నుండి జనగాం కు పశువులను బంధించి తరలిస్తున్న AP39 WC 4501 గల టాటా ఎంట్ర ట్రాలీ డ్రైవర్ కోన ముస్లి నీ తిరుమలయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ వారి సిబ్బంది చాకచక్యంతో సుబ్లేడ్ క్రాస్ రోడ్ వద్ద పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పట్టుపడ్డ వారిని స్టేషన్ కి తరలించి విచారించగా లారీలోని పశువుల ట్రాన్స్పోర్ట్ శేఖర్ గౌడ్ అని, టాటా ఎంట్రా వెహికల్ లోని పశువుల ట్రాన్స్పోర్ట్ రాంప్రసాద్ అని వెల్లడించారు. లారీలో 40 పశువులు మరియు ట్రాలీలో పది పశువులు ఉన్నాయి.లారీలో ఐదు పశువులు చనిపోగా వాటిని తిరుమలాయపాలెం వెటర్నరీ డాక్టర్ అనూష గారు పంచనామా నిర్వహించారు. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News