నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా, 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ రేవతి కమిషనర్ ను కోరారు. భవాని నగర్, ఆటోనగర్ నందు భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కరించాలని, కల్లూరు గ్రామం, కొత్తపల్లిలో లో ఇంటి పట్టాలు ఇచ్చారు స్థలం చూపాలని, సుందరయ్య నగర్ నందు డ్రైనేజి సమస్య పరిష్కరించాలని, మారుతి నగర్ పెద్ద కాలువలో నీరు సజావుగా వెళ్లేలా చూడాలని, చంద్రశేఖర్ రెడ్డి కాలనిలో నీటి కనెక్షన్ ఇప్పించాలని, సుందరయ్య నగర్ 8వ క్రాసులో రోడ్డు, కాలువలు నిర్మించాలని, శవాల ఊరేగింపులో పూలు చల్లడం, పుట్టినరోజు వేడుకలను అర్ధరాత్రి నిర్వహించడం ఇబ్బందిగా ఉంది పరిశీలించాలని, అమర రాజ కంపెనీ ఉద్యోగుల కోసం వాహనాలు పార్కింగ్ చేయడంతో ఇబ్బందిగా ఉంది పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.





