Tuesday, March 17, 2026

*ఎన్టీఆర్ రాజు మృతి టిడిపి పార్టీకి తీరని లోటు* తిరుమల: ఎన్టీఆర్ రాజు మృతి టిడిపి పార్టీకి తీరని లోటుని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తెలియజేశారు. సోమవారం తిరుమలలో ఎన్టీఆర్ రాజు స్వగ్రాహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించి అనంతరం రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తండ్రి ఎన్టీఆర్ రాజు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని తిరుమలలో వారి ఇంటికి వెళ్లి ఓదార్చి వారి కుటుంబానికి భరోసా కల్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని తెలిపారు. గతంలో ఆయన పార్టీకి ఎనలేని సేవలు అందించడం జరిగిందని వివరించారు. గతంలో ఆయన టిటిడి పాలక మండలి సభ్యులుగా ఉన్నప్పుడు తిరుమలలో ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, డిప్యూటీ మేయర్ ఆర్ .సి .మునికృష్ణ , తెలుగుదేశం పార్టీ నాయకులు రాజు యాదవ్, భాష, బాలాజీ సుబ్బు ,మాధవ్ వేలు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News