నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చిత్తూరు కలెక్టరేట్*మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ **మామిడి ధరను కిలోకు రూ.8కు పెంచాలనికోరుతూ చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన “చలో కలెక్టరేట్”కార్యక్రమం సోమవారం ఉద్ధృతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) మూలం చంద్రమోహన్ రెడ్డి పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని, ప్రస్తుత ధరలతో సాగు ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కిలోకు రూ.8 ధరను ప్రభుత్వం ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మరింత పెద్ద ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.* ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మామిడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను నినాదాల రూపంలో వెల్లడించారు.





