నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………… తెలంగాణ గోరక్ష ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొండగట్టు భూములను అటవీ శాఖ అధికారులు కొండగట్టు ఆలయం పరిసర ప్రాంతాలలో ఇట్టి భూములు ఫారెస్ట్ కు సంబంధించినవిగా మార్కింగ్ చేయడం జరిగింది.ఈ మార్కింగ్ చేసే సమయంలో ఆలయ సిబ్బందికి గాను.ఎండోమెంట్ ఆఫీసర్ కు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొండగట్టు అంజన్న భక్తుల మరియు హిందువుల మనోభావాలను దెబ్బ తినే విధంగా కొండగట్టు అంజన్న ఆలయానికి మార్కింగ్ చేయడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి 100 గదుల నిర్మాణం కొరకై 35.19 కోట్లు మంజూరు చేపించిన పనులను అడ్డుకునే విధంగా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తూ అట్టి నిర్మాణాన్ని ఆపేవిధంగా కొండగట్టు ఆలయం అభివృద్ధి జరగకుండా వారు చేస్తున్న పనులు యావత్ హిందూ సమాజం మనోభావాలను దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం ఆలయానికి అక్కడ ఉన్న అటవీశాఖ భూములను ఏ విధంగా అటాచ్ చేశారో అదేవిధంగా కొండగట్టు ఆలయం విస్తీర్ణ కొరకై కొండగట్టు ఆలయం చుట్టూ ఉన్న అటవీ భూములను అటాచ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి.అదేవిధంగా కొండగట్టు ఆలయ భూములలో గోశాలకు కేటాయించిన భూములను ప్రవేట్ వ్యక్తులకు లీజు రూపంలో ఇవ్వడం జరిగింది,ఇట్టి లీజును రద్దుచేసి అట్టి భూమిని గోశాలకు కేటాయించి గోశాల నిర్మాణం చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, జిల్లా కార్యదర్శి కస్తూరి రాజన్న, నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్,లక్ష్మీనారాయణ,రాములు, భూమేష్, పరంధాం, కృష్ణ, శ్రీధర్ గారు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.





