Saturday, May 16, 2026

నూతన పాలక వర్గం చేతికి గ్రామపంచాయతీ పగ్గాలు.. నేడే ప్రమాణ స్వీకారం బుగ్గారం ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి నక్క రాజవ్వ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి నూతన పాలక వర్గం కొలువు దిరింది.స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శి లు నూతన ఎన్నికైన వారి చేత ప్రమాణ స్వీకరం చేయించారు.అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబెర్ లను గ్రామ ప్రజలు పలువురు పూల మాల వేసి శాలువాతో సత్కరించారు.ప్రమాణ స్వీకరం అనంతరం నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.దింతో ఈ రోజు నుండి గ్రామపంచాయతీ ల్లో నూతన పాలక వర్గంతో పాలన కొనసాగుతుంది.గత రెండు సంవత్సరాల కాలంగా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింది.నేటి నుండి నూతన పాలక వర్గం చేతికి పగ్గాలు స్పెషల్ ఆఫీసర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శి పగ్గాలు అప్పజెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News