నేటి సాక్షి ,నారాయణపేట, డిసెంబర్ 22, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని ఎంనోని పల్లి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం సోమవారం నాడు గ్రామ సర్పంచ్ బోయ నరేష్ ఆధ్వర్యంలో మంచినీటి బోరును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులను కోరారు. ప్రస్తుతం గ్రామంలో 19 ఇందిరమ్మ ఇండ్లు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానన్నారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. యమునంపల్లి గ్రామాన్ని మోడల్ గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయుటకు తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో హైమాస్ లైట్లు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కళ్యాణ మండపం ఏర్పాటుకు కుంభం శివకుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళామని అదేవిధంగా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు అధికార ద్వారా ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఆయన వివరించారు బీసీ కాలనీలో విద్యుత్ సమస్య పరిష్కారానికి స్తంభాలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి కుంభం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరహరి ఉపసర్పంచ్ సిద్ధప్ప తో పాటు గ్రామ వార్డు సభ్యులు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





