Tuesday, March 17, 2026

*శ్రీకాళహస్తి కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతిని అడ్డుకోండి* * *సమాచార హక్కు చట్టం తిరుపతి జిల్లా కార్యదర్శి యోగానంద పిలుపు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నడు లేని విధంగా మున్సిపాల్ కమిషనర్ భవాని ప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారి శారద కొంతమంది ప్రైవేటు వ్యక్తులను అడ్డు పెట్టుకుని, కొంతమందికి తప్పుడు నోటీసులు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, డబ్బులు దండుకుంటున్నారని బాధితులైనటువంటి జై. రాజేంద్రప్రసాద్, డి. సిరి తొ కలిసి సమాచార హక్కు చట్టం తిరుపతి జిల్లా కార్యదర్శి యోగానంద తిరుపతి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో చెప్పారు. నిర్మాణం సమయంలో లంచం ఇవ్వలేదని అక్కస్సుతో హైకోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్, మునిసిపల్ పన్ను, ఉన్నప్పటికీ తప్పుడు డోర్ నెంబర్ రాసి,రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చదవకుండా, కొలతలు కూడా వేయకుండా, హైకోర్టు స్టే ఆర్డర్ చదవకుండా మా ఇల్లు ధ్వంసం చేసి రక్షస ఆనందం పొందారని మున్సిపల్ కమిషనర్,టి పి ఓ శారద వ్యవహరించిన వ్యవహార శైలి బాధాకరమని చెప్పారు. కమిషనర్ అసిస్టెంట్ నీల్ ద్వారా చేస్తారని ఆరోపించారు.చిన్న బిడ్డ తల్లి అని కూడా చూడకుండా లాగి పడేయడం జరిగిందని చెప్పారు. మా ఇల్లును కూల్చడమే కాకుండా కాలహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మాపై తిరిగి క్రిమినల్ కేసులు పెట్టారని వారు వీరిరువురి పైన సంబంధిత అధికారులు కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని, వీరిపై హైకోర్టులో కేసు నమోదు అయినదని కేసు నెంబర్ సి సి ఎస్ ఆర్ 51814/2025 అని చెప్పారు. ఈ సమావేశంలో యోగానందతోపాటు బాధితులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News