నేటిసాక్షి,మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా అక్రమ నివారణకు, రైతులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక యాప్ ను నమోదు చేశారని, ముందుగా రైతులు గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని, అందులో తమ వివరాలను నమోదు చేసిన తర్వాత, రైతులు 24గం.లల్లో యూరియా తీసుకెళ్లాలని, దామరచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి రుషేంద్ర మణి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం దామరచర్ల మండల కేంద్రంలోని రైతులకు యూరియా బుకింగ్ యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు యాప్ లో యూరియా ను తప్పక బుక్ చేసుకోవాలని, లేని యడల యూరియా సరఫరా ఆగిపోతుందని తెలిపారు. ప్రతి పర్టిలైజర్ షాప్ యజమానులు యూరియా వివరాలను ప్రతి ఒక్కటి యాప్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆర్ పార్వతి, రైతులు వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీరకోటి రెడ్డి, సుందర్ రెడ్డి వీరయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.





