నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 22ఇది కాగజ్నగర్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఈ.సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ కాగజ్నగర్ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికుల గత నాలుగు నెలల నుండి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని బకాయిలో ఉన్న pf esi కోటి 50 లక్షలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్.కి వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు నుండి మున్సిపల్ కార్యాలయం ఎదుట విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు కార్మికులకు గత నాలుగు నెలల నుండి వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందితో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కాగజ్నగర్ మున్సిపల్ లో పనిచేసే కార్మికులు పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేస్తే తప్ప గాని వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు ప్రతినెల క్రమ తప్పకుండా వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన అధికారుల తీరు మారిన పరిస్థితి ఉంది కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్. జోక్యం చేసుకొని కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించేలా కృషి చేయగలరని కోరుతున్నాము, ఈ పోరాటనికి మున్సిపల్ కమిషనర్. బాధ్యత వహించాలిఈ కార్యక్రమంలో మున్సిపల్.యూనియన్ జిల్లా కార్యదర్శి.శంకర్.మున్సిపల్.యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్సంజీవ్ మల్లేశ్ రమేష్.Eలక్ష్మి ఈశ్వరమ్మదుర్గమ్మ శోభ ప్రియదర్శిని.తిరుపతి బాపు లక్ష్మణ్ మహేందర్రాకేష్.మున్సిపల్ కార్మికులందరూ పాల్గొన్నారు





