*చొక్కారావుపల్లె గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణం* *సర్పంచిగా బాధ్యతలు స్వీకరించిన అరుకొంతం గోపాల్ రెడ్డి* గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లె పంచాయతీ ప్రత్యేక అధికారుల అధ్యక్షతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని నూతన సర్పంచ్ అరుకొంతం గోపాల్ రెడ్డి ని శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు





