Thursday, March 5, 2026

*మైనారిటీల సమస్యలపై వక్ఫ్ బోర్డు అధికారిని నియమించాలి:*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) మైనారిటీల సమస్యలపైవక్ఫ్ బోర్డు అధికారిని నియమించాలని డీఆర్ఓ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతి పత్రం అందజేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ బాషా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ బాషా వక్ఫ్ బోర్డు అధికారిని నియమించాలని , జిల్లాలో మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జిల్లా రెవెన్యూ అధికారి, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ జి. నరసింహులుకి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సమస్యలను శ్రద్ధగా విని, త్వరితగతిన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.జిల్లా పరిపాలన నుంచి లభించిన సానుకూల స్పందనకు షేక్ సిరాజ్ బాషా గారు కృతజ్ఞతలు తెలుపుతూ, మైనారిటీ వర్గాలకు త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలోమాజీ తిరుపతి జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ కరీముల్లా వల్లి, ఇలియాజ్ షేక్, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News