నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*వెదురు కుప్పం*మండలంలోని వైయస్సార్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వెదురు కుప్పం తరపున ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంపు చివరి రోజు (ఏడవ రోజు)ముగింపు సభను పెరుమాళ్ళపల్లి గ్రామంలో నిర్వహించడమైనది. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు లో భాగంగా సామాజిక స్పృహ మరియు ఇతరుల పట్ల అవగాహనను వాలంటీర్స్ ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన పరచును. ఎన్ఎస్ఎస్ నినాదం “నాట్ మీ బట్ యు” పల్లెలోని విధులలో నినాదించెను. మధ్యాహ్నం సచివాలయం సిబ్బంది, పాఠశాల సిబ్బంది మరియు కళాశాల సిబ్బందితో ఎన్ఎస్ఎస్ బృందం భోజనాలను ఏర్పాటుచేసీను. తదుపరి గ్రామసభలో కళాశాల ప్రిన్సిపల్ డా బి అన్నపూర్ణ శారద అధ్యక్షతన పలువురు గ్రామ ప్రజలను, సిబ్బందిని ఎన్ఎస్ఎస్ వాళ్లంటేరులతో సమావేశం ఏర్పాటుచేసెను. గ్రామ సభలో గ్రామ సర్పంచి బి శశి ఆనంద రెడ్డి ప్రసంగిస్తూ వివిధ దశలలో ఎన్ఎస్ఎస్ బృందం ప్రత్యేక సేవలను అందించినదని కొనియాడారు. గ్రామ ఉప సర్పంచ్ బి పద్మనాభం రెడ్డి మరియు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి పరిపరి విధాలుగా ఎన్ఎస్ఎస్ బృందం వారి పనితీరును కొనియాడారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బందిని, కొలువు ఇచ్చినటువంటి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులవారు సుబాస్ కి సాదరంగా కళాశాల ప్రిన్సిపాల్ , ఎన్ఎస్ఎస్ పిఓ సన్మానం చేశారు. నేటి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ కమిటీ మెంబర్లు అయినటువంటి డాక్టర్ వి నాగేశ్వరరావు, డాక్టర్ డి లావణ్య కుమారి, వై శ్రీనివాసులు నడిపించారు. సమావేశం చివరన ఎన్ఎస్ఎస్ బృంద ఆఫీసర్ డాక్టర్ సి మంగళ గౌరీ ప్రత్యేకంగా ప్రెస్ రిపోర్టర్స్ & మీడియా వారికి, పాఠశాల సిబ్బందికి పోలీసు వారికి ఇతర సిబ్బంది అందరికీ పరిపరి విధాల కృతజ్ఞతలను తెలియజేశారు. సభలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పనితనానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తపరిచారు.





