Tuesday, March 17, 2026

– ఈ కూటమి ప్రభుత్వం టోటలీ ఫెయిల్యూర్..- మాటల్లో కాదు. చేతల్లో చూపిస్తేనే ప్రజల వద్ద విశ్వసనీయత..- పీకుడు భాష కేవలం సినిమా డైలాగులకు మాత్రమే పరిమితం..- ప్రజలకు ఇలాంటి భాష ఉపయోగపడదని హితువు.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 23 ~అన్నమయ్య జిల్లా :-: మెడికల్ కాలేజ్ కోటి సంతకాలపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వ్యాఖ్యలను ప్రజలు గమనించాలని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అసలు రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో ఈ మంత్రికి తెలుసానని బొత్స ప్రశ్నిస్తూ ఏ గ్రామానికైనా వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నా ఐవిఆర్ఎస్ సర్వే చేస్తే ప్రజల అభిప్రాయమేంటో ఆ మంత్రికి అర్థమవుతుందన్నారు. చిల్లర మాటలు మాట్లాడి స్థాయి దిగజార్చుకోవద్దని సూచించారు. పీపీపీ ద్వారా అవినీతికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని అది మా పార్టీ విధానమని బొత్స చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి బెదిరింపులనడమేంటని స్వార్ధం కోసం పీపీపీల ద్వారా లబ్ధి పొందిన వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని బొత్స వార్నింగ్ ఇచ్చారు. ఇక, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు పేదలు అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన కార్పొరేటర్ల తలంపేనని బొత్స విమర్శించారు. మరి ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని గొంతు మూగ పోయిందా అని బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీపీపీ అక్రమాలపై చర్యలు ఉంటాయంటే బెదిరిస్తున్నారని కామెంట్స్ చేస్తారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని జ్యోతిష్యం చెబుతున్నారు. అంతే కానీ రాష్ట్రంలో అవినీతి మాత్రం పవన్ కు కనిపించడం లేదని బొత్స ఎద్దేవా చేశారు. ఇక, పీకుడు భాష కేవలం సినిమా డైలాగులకు పనికొస్తాయి. తప్ప ప్రజలకు ఉపయోగపడవని ఎమ్మెల్సీ బొత్స తెలిపారు. చేవ, సత్తా ఉన్న వాళ్ళు మాటలు తక్కువ చేతలు ఎక్కువగా ఉంటాయని అది లేనప్పుడే ఇలాంటి మాటలు ఎక్కువవుతాయని విమర్శించారు. ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న అభిప్రాయాలను సీఎం, మంత్రులు తెలుసుకుంటే వాస్తవ పరిస్థితులు బోధపడతాయని సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని రోడ్లు గోతులు కప్పేయాలని చెప్పిన ముఖ్యమంత్రి అది ఏ సంవత్సరంలోనని చెప్పలేదని నిధులిస్తే గోతులు కప్పుతారు. మాటలు చెబితే కాదన్నారు. చేతల్లో చూపిస్తేనే ప్రజలకు నచ్చుతారని బొత్స అన్నారు. రాజకీయాల్లో తూలనాడటం మంచి సాంప్రదాయం కాదు. సంయమనం పాటించడం మంచిదన్నారు. నేను లేగిస్తే మనిషిని కాదంటున్న వాళ్ళు లేగిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మారు వేషాల్లో వెళ్ళి పరిశీలిస్తే ప్రజల సమస్యలు అర్ధమవుతాయని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ ప్రభుత్వం టోట ల్లీ ఫెయిల్యూరని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద పనులు నిలిపివేస్తూ సర్క్యులర్ ఇవ్వడం చూస్తేనే ఈ ప్రభుత్వం పని తీరు, వ్యవస్థ మీద పెట్టలేదని తేలిపోయిందని ఉత్తర్వులు ఇచ్చిన, కామెంట్స్ చేసిన ఒక వేలు మమ్మల్ని చూపిస్తే మూడు వేళ్ళు మిమ్మల్ని చూపిస్తున్నాయని తెలిపారు. పవర్ పార్చెజ్ అగ్రిమెంట్ల మీద గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు 3 రూపాయలకు యూనిట్ ఎలా కొంటున్నారని ప్రశ్నించారు. యోగి ఆదిత్య నాథ్ తరహా ట్రీట్మెంట్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇవ్వమని సలహాలు ఇస్తున్నారు. మేయర్ అవిశ్వాస తీర్మానంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తామని ప్రభుత్వ నిర్ణయాలకు తలొగ్గి చర్యలు తీసుకోలేదు. న్యాయ స్థానం ద్వారా చర్యల కోసం పోరాటం చేస్తామని బొత్స తెలియజేశారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News