నేటి సాక్షి, నారాయణపేట, ,డిసెంబర్ 23, నారాయణపేట జిల్లాలోని గోటూరు గ్రామాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని గూడూరు గ్రామ సర్పంచ్ నాగమణి చంద్రమౌళి అన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగమణి చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని గ్రామస్తులకు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లావణ్య, వాడు సభ్యులు శివలీల, మొగులమ్మ, వెంకటేష్, బాలకృష్ణయ్య, అశోక్, కె .రాములు, దేవమ్మ ,గౌడమ్మ, వెంకట్రాములు గౌడ్, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.





